calender_icon.png 13 January, 2026 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలపల్లి మండలానికి 108 అంబులెన్స్ ఏర్పాటు చేయాలి

13-01-2026 08:16:36 PM

సర్పంచ్ పాటకుల అనుష 

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకుగాను పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలానికి 108 అంబులెన్స్ ఏర్పాటు చేయాలని మంగళవారం జూలపల్లి గ్రామ సర్పంచ్ పాటకుల అనూష జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ లను కలిసి వినతిపత్రం అందజేశారు. మండలానికి అంబులెన్స్ లేక అత్యవసర పరిస్థితుల్లో గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని,  మండలంలోని 13 గ్రామాల ప్రజల అత్యవసర సేవల వైద్య సేవల నిమిత్తం మండల కేంద్రానికి 108 అంబులెన్స్ ఉంటే గ్రామాల ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.

అత్యవసర పరిస్థితుల్లో పెద్దపల్లి,  కరీంనగర్ వెళ్లాలంటే 30 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుందని, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర వైద్య సేవల నిమిత్తం ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని 108 మంజూరు చేయాలని   సర్పంచ్ పాటాకుల అనూష కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ పాటకుల అనిల్, తాటిపల్లి శ్రీనివాస్ లు ఉన్నారు.