05-07-2025 07:01:35 PM
నూతనకల్ (విజయక్రాంతి): వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని డిఎంహెచ్వో చంద్రశేఖర్(DMHO Chandrasekhar) అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మండలంలోని అన్ని గ్రామాలలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు, ఈ సమావేశంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.