calender_icon.png 5 July, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం..

05-07-2025 07:06:52 PM

మామిడిగూడెంలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం..

బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మామిడిగూడెం గ్రామంలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి(CI Shashidhar Reddy) ఆధ్వర్యంలో శనివారం పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వాహన పత్రాలు సరిగా లేని 25 బైక్ లను, 3 బైక్ లను  సిజ్ చేశారు. అదేవిధంగా ఒక వ్యక్తి వద్ద రెండున్నర లీటర్ల గుడుంబాను స్వాధీన చేసుకున్నారు. రెండు బెల్ట్ షాపులో లిక్కర్ ను కూడా పట్టుకున్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపి రవికుమార్ మాట్లాడుతూ.. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యతని పేర్కొన్నారు. గ్రామలలో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎవరైనా కొత్త వారు అద్దెకు వస్తే వారికి సంబందించిన పూర్తి సమాచారం తీసుకోవాలన్నారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్ లకు, వాట్సాప్ కాల్స్ కు స్పందించవద్దని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. మత్తుపదార్థాలైన గంజాయి సేవించడం వల్ల యువత నిర్వీర్యం అవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైన గుడుంబా తయారుచేసినా, అమ్మిన వాళ్లపైన కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, దేవపూర్ ఎస్సై, మందమరి ఎస్సై, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫోర్స్, మందమర్రి సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.