31-10-2025 12:05:50 AM
ప్రదర్శనతో పలువురి ప్రశంసలు అందుకున్న మౌన్వి
ఖమ్మం, అక్టోబర్ 30(విజయక్రాంతి): ఖమ్మం పట్టణం వీడీఓసీ కాలనీలోని సర్వజ్ఞ పాఠశాల విద్యార్థిని జి.మౌన్వి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలో నృత్య ప్రదర్శన చేసి పలువురి ప్రశంసలు అందుకున్న ది. ఈ నెల 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు జరుగుచున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా చిన్నారి మౌన్వి తన అద్భుత ప్రతిభను ప్రదర్శించి ఆహుతులచే శబాష్ అనిపించుకున్నారు.
ఖమ్మం నగరంలోని ప్రముఖ వైద్యశాల మమత మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వెంకటేశ్వరరావు, అనితారావు దంపతుల కుమార్తె మౌన్వి కూచిపూడి నృత్యంలోని మెళకువులను, భావ వ్యక్తీకరణను పండిత పామరులకు అర్ధమయ్యే రీతిలో ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. భారతీ య సంస్కృతి, కళలకు అద్దం పటేలా మౌన్వి చేసిన ప్రదర్శన వచ్చినవారిని ఆకట్టుకుంది.
మౌన్వి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ఆర్‌వీ నాగేంద్రకుమార్ మౌన్వి ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. మన సర్వజ్ఞ విద్యార్థిని మౌన్వి విదేశీ గడ్డపై భారతీయ కళారూపాన్ని ఇంత గొప్పగా ప్రదర్శించడం మనందరికీ గర్వకారణం అన్నారు.
ఇది కేవ లం ఆమె ప్రతిభకేకాక, సర్వజ్ఞ పాఠశాల విలువలకు, విద్యార్థులకు అందించే ప్రోత్సాహానికి నిదర్శనమన్నారు. అలాగే మౌన్వికి పాఠశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అద్భుత ప్రదర్శనలతో మరి న్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అన్నారు.