07-12-2025 12:00:00 AM
ఖైదీల ఆరోగ్య, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
మలక్‌పేట్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): మహిళా ఖైదీల ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ధి, పునరావాస అవకాశాలను మెరుగుపరచడానికి జైల శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అన్నారు. శనివారం చంచల్‌గూలోని మహిళల ప్రత్యేక జైల్లో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. క్యాంప్లో రక్తపరీక్షలు, పాథాలజీ, గైనకాలజీ, కంటి పరిశీలన, దంత పరీక్షలు వంటి విస్తృత వైద్య సేవలను నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సామ్యూ మిశ్రా మాట్లాడుతూ ఆరోగ్య శిబిరం ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, వారి విశ్వాసం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. ఆ తర్వాత, హనీ ప్యాకింగ్ యూనిట్‌ను మహిళల ప్రత్యేక జైలులో డీజీ సౌమ్య మిశ్రా ప్రారంభించారు ప్రారంభించారు. చర్లపల్లి, సెంట్రల్ ప్రిజన్ సంగారెడ్డి, సెంట్రల్ ప్రిజన్ నిజామాబాద్, జిల్లా జైలు ఖమ్మం, విర్రాబాద్ జైల్ ల్యాండ్లలో ఉత్పత్తి అయిన తేనెను మహిళ ఖైదీలు ఇక్కడ ప్యాక్ చేసి, లేబుల్ చేస్తారని ఆమె వివరించారు.
ఈ యూనిట్ ద్వారా ఖైదీలు ప్రాక్టికల్ నైపుణ్యాలను పొందుతూ, ఉపాధిని పొందగలుగుతారన్నారు.. ఇది జైళ్లను ఉత్పాదకత, నైపు ణ్య అభివృద్ధి, సామాజిక శక్తివంతం కేంద్రాలుగా మార్చగలిగిన కేంద్రం గా నిలుస్తుం దని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ హైదరాబాద్ జిల్లా గవర్నర్ కె ఇన్నారెడ్డి, హైదరాబాద్ రేంజ్ డీఐజీ డాక్టర్ డి. శ్రీనివాస్, పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు ఎస్. ఎం. ఖాలిద్ అక్థర్, మహిళల ప్రత్యేక జైలు సూపరింటెండెంట్ బి.అమరవతి తదితర అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.