24-10-2025 11:13:33 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని రా చెరువు సుందరీ కరణకు హెచ్ఎండి ఏ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఉదయం బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి వేగంగా, పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రా చెరువు సుందరీకరణకు సహకరించినటువంటి ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.