12-01-2026 02:48:57 AM
నేడు, రేపు నగరవ్యాప్తంగా మెగా స్పెషల్ డ్రైవ్
ప్రతి వార్డులో ప్రత్యేక సేకరణ కేంద్రాల ఏర్పాటు
పాత ఫ్రిజ్, టీవీలు,మొబైల్స్, బ్యాటరీల సేకరణ
శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్
జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 11 (విజయక్రాంతి): పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఈ నివారణే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా సోమ, మంగళవారాల్లో నగరవ్యాప్తంగా మెగా ఈ శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ ప్రకటించారు. నగరంలోని ప్రజలకు అందుబాటులో ఉండేలా దాదాపు 300 వార్డులు, ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ- సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల మహిళల సహకారంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్ట నున్నారు.
ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, టీవీ, మానిటర్లు, సీపీయూలు, ల్యా ప్‌టాప్‌లు, కీబోర్డులు, మౌస్‌లు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, పవర్ బ్యాంకులు, యూపీఎస్‌లుచ బ్యాటరీల వంటి ప్రమాదకర వ్య ర్థాలు సేకరిస్తారు. సాధారణంగా ఈ-వేస్ట్ను కాలువల్లో లేదా డంప్ యార్డుల్లో పారేయడం వల్ల అందులోని రసాయనాలు భూ మిలోకి, నీటిలోకి చేరి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ డ్రైవ్ ద్వారా సేక రించిన వ్యర్థాలను అధీకృత రీసైక్లింగ్ ఏజెన్సీలకు తరలించి, అక్కడ శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ డ్రైవ్‌ణు విజయవంతం చేసేందుకు ఇప్పటికే అన్ని జోన్లు, సర్కిళ్లలో మైకుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.