12-01-2026 02:50:16 AM
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో ఆదివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా ౫.౬ డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 7.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని 10 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో మరింత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. వృద్ధులు, చిన్నపిల్లలు ఉదయం, సాయంత్రం వేళల్లో బయట తిరుగొద్దని హెచ్చరించింది. సంక్రాంతి నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్తున్న ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు.