calender_icon.png 31 December, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డీఐజీ ఆకస్మిక తనిఖీ

30-12-2025 12:26:02 AM

ఒకే ఒక్కడు కథనంపై విచారణ.. అక్రమ రిజిస్ట్రేషన్‌లపై ఆరా..

విజయ క్రాంతి ఎడిషన్ లో వచ్చిన అక్రమ రిజిస్ట్రేషన్లు వివరాల సేకరణ

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ డీఐజీ వెంకటరమణ

బాన్సువాడ,డిసెంబర్ 29 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒకే ఒక్కడు అనే కథనం సోమవారం విజయక్రాంతి ఎడిషన్లో ప్రచురితమైన కథనానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల సబ్ రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి వెంకటరమణ బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డులను, డాక్యుమెంట్లను, సిబ్బంది పనితీరును పరిశీలించారు. విజయక్రాంతిలో వచ్చిన అక్రమ రిజిస్ట్రేషన్ ల పై ఆరా తీశారు. ఒకే ఒక్కడు అన్ని తానై సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇష్టారీతిన అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని అధికారులు సహకరిస్తున్నారని వచ్చిన కథనంపై  బాన్సువాడ సబ్ రిజిస్టర్ శివప్రసాద్ అడిగి తెలుసుకున్నారు.

కార్యాలయంలో కార్యాలయంలో అధికారులు తప్ప సిబ్బంది తప్ప బయట వ్యక్తులు రైటర్లు ఎవరు కూడా ఉండకూడదని ఆదేశించారు. విజయక్రాంతిలో వచ్చిన బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన ఆనుకుని ఉన్న అక్రమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి పంపాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాకుండా కార్యాలయంలో గత రెండు మూడు నెలలు నుండి జరిగిన రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్ వివరాలు కార్యాలయానికి పంపాలని అదేవిధంగా జిల్లా రిజిస్టర్ బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పూర్తి విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని డీఐజీ ఆదేశించినట్లు తెలిసింది. విజయక్రాంతిలో వచ్చిన కథనానికి బాధితులు అభినందనలు తెలిపారు.