calender_icon.png 12 January, 2026 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరభద్రుడి సన్నిధిలో హల్ది వేడుకలు

10-01-2026 12:00:00 AM

భీమదేవరపల్లి, జనవరి 9 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంకొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నే శుక్రవారం స్వామివారికి మంగళ స్నానం, మృత్ సంగ్రహణం ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారం భం అయ్యాయి. శనివారం స్వామివారి సన్నిధిలో వీరభద్ర స్వామి వారి కళ్యాణం 14న భోగి పండుగ, 15 మకర సంక్రాంతి బండ్లు తిరుగుట, జాతర ఉత్సవం 16 కనుమ ఉత్సవం, 18 సాయంత్రం స్వామివారి గ్రామ పర్యటనతో బ్రహ్మో త్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు.