19 August, 2026 | 1:46 AM

భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి

19-08-2026 12:22 AM

గీతం సదస్సులో అభిప్రాయపడ్డ సైకాలజీ నిపుణులు

పటాన్‌చెరు, ఆగస్టు 18: మానసిక పరిశోధన యొక్క విస్తరిస్తున్న పరిధిని, సంక్లిష్టమై న మానవ, సామాజిక సవాళ్లను అంతర్-విభాగ దృక్కోణాల ద్వారా పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని మానసిక శాస్త్ర నిపుణులు అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ‘అనిశ్చితి కాలం లో మనస్తత్వ శాస్త్రం: అంతర్-విషయ దృక్ప థం, ఆవిష్కరణ, ప్రభావం’ అనే అంశంపై రెండు రోజుల సదస్సును 17, 18 తేదీలలో నిర్వహించారు.

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని అప్లైడ్ సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు హైబ్రిడ్ పద్ధతిలో జరిగింది. ఇందులో మనస్తత్వశాస్త్రం, దాని అనుబంధ విభాగాలకు చెందిన పరిశోధకులు, విద్యావేత్తలు, నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అనిశ్చితి అనేది వ్యక్తిగత జీవితాలు, కార్యాలయాలు, విద్య, ఆరోగ్యం, సాంకేతికత, సమాజాన్ని అంతకంతకూ ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో, వేగంగా మారుతున్న ఈ వాస్తవాలను మనస్తత్వ శాస్త్రం ఎలా స్పందించగలదో పరిశీలించడానికి సైకాన్ ’26 ప్రయత్నించింది.