24-07-2025 02:36:56 PM
నల్లగొండ టౌన్ జూలై 24 (విజయ క్రాంతి): నేషనల్ హైవే 565(National Highway 565) రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చావడానికైనా సిద్ధం కాని ప్లాట్లను మాత్రం వదులుకోమని మామిళ్ల గూడ బాధితులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ గోడును వెల్లబుచ్చారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు గజానికి 5400 ఇచ్చి అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదే రోడ్డుకు పానగల్లు, అర్జలబాయి వారికి గజానికి 10, 500రూ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు అన్యాయం చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.మంత్రి పై మాకు పూర్తి నమ్మకం ఉన్నదని ఆపదల్లో ఆదుకునే మంత్రి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి(Komatireddy Venkat Reddy) ప్రత్యేకమైన పేరు ఉందని తెలిపారు.మీపై నమ్మకాన్ని కోల్పోయే విధంగా బాధితులకు అన్యాయం చెయ్యొద్దని కోరారు.త్వరలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు కలిసి మా గోడును వివరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బాధితులు ఏమి రెడ్డి సతీష్ రెడ్డి, జాన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, లింగయ్య, రమాదేవి, వెంకట్ రెడ్డి, అజీముద్దీన్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.