19-05-2024 01:35:02 AM
సోమ, శుక్రవారాల్లోనే అదనపు సర్వీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు అని జరుగుతున్న ప్రచారంపై మెట్రో రైల్ అధికారులు శనివారం స్పష్టతనిచ్చా రు. రోజువారి మెట్రో సర్వీసుల వేళ ల్లో ఎలాంటి మార్పులు లేవని, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు యథాతథంగా సర్వీసులను నడపనున్నట్లు స్పష్టం చేశా రు. కానీ సోమవారం, శుక్రవారం మాత్రం ప్రయాణికుల రద్దీ, సౌకర్యార్థం అదనపు సర్వీసులు అందు బాటులో ఉంటాయని తెలిపారు. సోమవారం ఉదయం 5:30 గంట ల నుంచి నడుపుతామని, శుక్రవా రం మాత్రమే రాత్రి 11:45 వరకు సర్వీసులను ట్రయల్ బేసిస్‌గా నడపనున్నట్లు వెల్లడించారు.