calender_icon.png 11 November, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వానకాలం నుంచే పంటల బీమా

19-05-2024 01:39:18 AM

ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి సీతక్క

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): వచ్చే వానకాలం సీజన్ నుంచి పంటలకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. రైతులపై భారం పడకుండా బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమె.. శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షాలతో తడిచిపోయిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.

మూడునాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తడిచిన ప్రతి గింజ ను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్లు, వ్యసాయశాఖ అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాలు, వరదల పరిస్ఠితిని ఆరా తీశారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. వానాకాలం సీజన్ నుంచే పంటల బీమాను అమలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇదివరకే అధికారులను ఆదేశించారు. పంట బీమా ప్రతిపాదనను పరిశీలించాలని, ఎన్నికల సంఘం అనుమతితో టెండర్ల ప్రక్రియ చేపట్టాలని సూచించారు.