12-06-2025 09:16:57 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టీ మైనారిటీ సంక్షేమా అభివృద్ధి శాఖ మంత్రిగా ఆడ్లూరి లక్ష్మన్ కుమార్(Adluri Laxman Kumar), కార్మిక, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్, వివేక్ వెంకటస్వామిల ను ఎంహెచ్ డీ నాయకులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. హైదారాబాద్లో గురువారం ఇద్దరు మంత్రులను కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు.
మంత్రులను సన్మానించిన వారిలో మాదిగ హక్కుల దండోరా జాతీయ, రాష్ట్ర నాయకులు దండు సురేందర్ మాదిగ, జాతీయ అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు చిలుక రాజనర్సు మాదిగ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ బొర్ర శాంతి కుమార్, ఎమ్మెస్ యు రాష్ట్ర అధ్యక్షుడు పొత్తూరి రమేష్ మాదిగ ,లీడ్ క్యాప్ రాష్ట్ర అధ్యక్షుడు కొలుగూరి విజయ్ కుమార్ మందమర్రి పట్టణ కన్వీనర్ బచ్చలి భీమయ్య, ఎన్ హెచ్ డి సీనియర్ నాయకులు రత్నం సంపత్, మంతెన సుమన్,రామ కృష్ణ ఉన్నారు.