8 July, 2026 | 7:59 PM

Breaking News

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •  

ఆర్థికాభివృద్ధిలో మైక్రోఫైనాన్స్ కీలకపాత్ర

03-06-2025 12:10 AM

2033 నాటికి 6.68 లక్షల కోట్లకు

న్యూఢిల్లీ, జూన్ 2: భారతదేశ ఆర్థికాభివృద్ధిలో మైక్రోఫైనాన్స్ రం గం కీలకపాత్ర పోషిస్తోంది. తక్కువ ఆదాయ కుటుంబాలు, మహిళలు, గ్రామీణ ప్రజలకు మైక్రోఫైనాన్స్ సం స్థలు (ఎంఎఫ్‌ఐ) సులభంగా రుణా లు మంజూరు చేస్తూ సహాయం చే స్తున్నాయి. మహమ్మారి దెబ్బ తర్వా త ఈ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మరీ ముఖ్యంగా గ్రామీ ణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఎంఎఫ్‌ఐలు పుంజుకున్నాయి.

భారతదేశంలో ఎంఎఫ్‌ఐల వార్షిక వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదై.. 2033 చివరినాటికి రూ. 6,68,000 కోట్ల కు చేరుకుంటుందని అంచనా. గడిచిన ఐదేండ్లుగా ఈ రంగం 18 శాతం పైచిలుకు వృద్ధి సాధించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్ 31 2024 వరకు ఈ రంగం మొత్తం రు ణాల విలువ రూ. 3,48,015 కోట్లు (41.4 బిలియన్ అమెరికన్ డాలర్లు) గా ఉంది. స్వయం సహాయక బృం దాలకు ఈ సెక్టార్ అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేస్తోంది.