23-07-2025 12:49:10 AM
బెజ్జూర్, జూలై 22 (విజయక్రాంతి): మండల కేంద్రంలో సిర్పూర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాచకొండ శ్రీ వర్ధన్, ఆదివాసి నాయకులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసుల హక్కులను దృష్టిలో పెట్టుకొని జీవో 49 రద్దు చేస్తున్నట్టు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుందన్నారు.
ప్రజల ప్రభు త్వం ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవో నెంబర్ 49 రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కుడుప విశ్వేశ్వర్, శంకర్, బాబాజీ, రాజారాం ఆదివాస సంఘాల నాయకులు పాల్గొన్నారు.