23-07-2025 12:50:37 AM
- ఆదివాసీలను తప్పుదోవ పట్టిస్తున్నారు
- ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 22 (విజయక్రాంతి): జిల్లా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఏర్పా టుకు తీసుకువచ్చిన జీవో 49 రద్దు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు చేపడుతున్న ప్రచారం బూటకం అని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజా పాలన కాదని ప్రజలను పీడించే రాక్షస పాలన అని ఎద్దేవా చేశారు.
జీవో రద్దు చేయలేదని కేవలం నిలుపుదల మాత్ర మే చేసిందని ప్రభుత్వానికి దమ్ముంటే వెంట నే జీవోను పూర్తిగా రద్దు చేయాలని డిమాం డ్ చేశారు. ఓట్ల కోసమే జీవో ను నిలుపుదల చేశారని విమర్శించారు.ఆదివాసీలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చులకనగా కనబడుతున్నారా ప్రశ్నించారు.జీవో రద్దు కోసం పోరాట యోధుడు భీం స్ఫూర్తితో ఉద్య మం చేస్తామని స్పష్టం చేశారు.ప్రజలు గమనిస్తున్నారని గ్రామాలలో కాంగ్రెస్ నాయ కులకు ఎదురుదెబ్బ తప్పదన్నారు.ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ మర్సు కోల సరస్వ తి నాయకులు బుర్సా పోచ్చయ్య,రవీందర్, హైమద్, భీమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.