calender_icon.png 27 July, 2025 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాండూరులో భారీ వర్షం

23-07-2025 12:48:37 AM

పలు కాలనీలో ఇళ్లలోకి వరద నీరు

వికారాబాద్ జులై 22( విజయక్రాంతి ) వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి నియోజకవర్గంలో నిన్న రాత్రి కుండపోత వర్షం ప డింది. దీంతో ఆయా ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగ్న నది ఉధృతంగా ప్రవహి స్తుంది. తాండూర్ పట్టణంలోని మార్కండే య కాలనీ గ్రీన్ సిటీ ఇతర కాలనీలలోకి వరదనీరు భారీగా చేరింది. వీధులన్నీ నీట మునిగి కోకట్ రోడ్డు ప్రాంతంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాండూ ర్ హైదరాబాద్ ప్రధాన రహదారి మార్గం లో వరద నీరు నిలిచింది. పలుచోట్ల భారీ వరదతో వాహనాలు సైతం కొట్టుకపోయా యి. పరిగి పట్టణంలోనూ నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షం తో బీసీ కాలనీలో రోడ్డుపై మోకాళ్ళ లోతు కు వరద నీరు వచ్చింది.

బార్పేట్ మలుపు వద్ద శారద గార్డెన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా నేషనల్ హైవేపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇ బ్బందులు ఏర్పడ్డాయి. బీసీ కాలనీలో ప్రజ లు తమ వాహనాలు నీట మునగకుండా ఎత్తున ప్రదేశాల్లో పార్కు చేయాల్సి వచ్చింది. భారీ వర్షం పడిన ప్రతిసారి బీసీ కాలనీవాసులు ఇబ్బందులుపడుతున్నారు.