19 April, 2026 | 2:11 PM

మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ సస్పెండ్

21-05-2025 12:06 AM

ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

హనుమకొండ, మే 20 (విజయ క్రాంతి): ఓ భూ వివాదం కేసులో  బాధితులకు న్యాయం చేయకుండా, తప్పుడు కేసును నమోదు చేయడమే కాకుండా ఈ కేసులో మరణించిన వ్యక్తి పేరును కూడా నమోదు చేసి నిందితులకు మిల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ వెంకటరత్నం సహకరించడం అప్పట్లో సంచలం సృష్టించింది. అలాగే మరో కేసులో మహిళ నిందితురాలిని పోలీస్ స్టేషన్ ఆవరణలో లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా విచారణలో నిర్ధారణ కావడంతో  మిల్స్ కాలనీ ఇన్స్ స్పెక్టర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.