calender_icon.png 5 August, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటోను ఢీకొట్టిన మినీ ట్రావెల్స్ బస్సు

05-08-2025 12:03:16 AM

ఒకరు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు

 శాలిగౌరారం, ఆగస్టు 4 : ఆగి ఉన్న ఆటోను మినీ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒకరు మృతిచెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శాలిగౌరారం మండలంలోని మాదారం కలాన్ గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ శైలం నుండి మహబూబాబాద్ వెళుతున్న మినీ ట్రావెల్స్ బస్సు సోమవారం తెల్లవారు జామున ఎదురుగా వస్తున్న ఆటో ను డీకొని 365 నెంబర్ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న కాలువ లో కి దూసుకు వెళ్ళింది.దాంతో ఒక్కరు ఘటన స్థలం లోనే మృతి చెందగా,15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.క్షత గాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్లారు. అందులో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉండటం తో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తీసుకెళ్లి నట్లు సమాచారం.ఈ విషయం పై పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.