05-08-2025 12:00:00 AM
సర్టిఫికెట్లు అందజేసిన వ్యవసాయ సాంకేతిక యజమాన్య సంస్థ
నిజామాబాద్ ఆగస్టు 4: (విజయక్రాంతి): నిజామాబాద్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ), ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం పై ఏడు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ గ్రామీణ యువ రైతులకు జీవ నియంత్రణ ప్రయోగశాల, శ్రద్ధానంద్ గంజ్ నిజామాబాద్ నందు నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల ప్రసాద్, పథక సంచాలకులు (ఆత్మ) మాట్లాడుతూ శిక్షణ పొందిన గ్రామీణ యువ రైతులు రాబోయే రోజులలో పకృతి వ్యవసాయం చేస్తూ స్వయం ఉపాధి ద్వారా ఆదాయాలు అర్జించాలని యువ రైతులకు ఆయన సూచించారు. శిక్షణ పొందిన వారికి శిక్షణా పూర్తిచేసిన ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డి.పద్మావతి డి.డి.ఏ రైతు శిక్షణ కేంద్రం.కే దైవ గ్లోరీ డి.పి.డి ఆత్మ, శ్రీ డి. భరత్ కుమార్ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ తో పాటు 15 మంది శిక్షణా రైతులు పాల్గొన్నారు.