07-05-2025 04:21:14 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఆపరేషన్ సిందూర్' నిర్వహించినందుకు భారత సాయుధ దళాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ప్రశంసించారు, ఏప్రిల్ 22న 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న క్రూరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతిస్పందన అని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్రాల ప్రధాన కార్యదర్శులు డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశానికి ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ వివరాలను పంచుకోనుంది.