calender_icon.png 19 November, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి నాయకునికి మంత్రి పరామర్శ

19-11-2025 05:36:49 PM

మందమర్రి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు రామటెంకి దుర్గరాజ్ కుమారుడు శ్రీకాంత్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా సమాచారం తెలుసుకున్న మంత్రి వివేక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పట్టణంలోని దుబ్బగూడంలో ఆయన నివాసంలో బుధవారం మంత్రి వివేక్ మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులు అధైర్య పడవద్దని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు సొత్కు సుదర్శన్, ఉపేందర్ గౌడ్, తుంగ పిండి రాజేష్ కుమార్, ఆకారం రమేష్ తదితరులు పాల్గొన్నారు.