19-11-2025 05:31:28 PM
మెట్ పల్లి (విజయక్రాంతి): మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాల్య వివాహాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఐసిడిఎస్ సిడిపిఓ మణెమ్మ, అంగన్వాడి సూపర్వైజర్ ప్రతిభ మాట్లాడారు. బాల్య వివాహ చట్టం- 2006, పోక్సో చట్టం-2012, మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించడం జరిగింది. బాల్య వివాహాల నిరోధక చట్టం-2006 ప్రకారం 18 సంవత్సరాలలోపు అమ్మాయికి 21 సంవత్సరంలోపు అబ్బాయికి వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు.
బాల్యవివాహాల వల్ల పిల్లలకు భవిష్యత్తులో మానసిక శారీరక ఎదుగుదల ఆగిపోతుందని అలాగే బాలబాలికలు మత్తకి బానిస అవ్వడం, మొబైల్ ఫోన్స్ కి దూరంగా ఉండాలని సూచించారు. 18 సంవత్సరాలలోపు బాలబాలికలకి రక్షణ అవసరమైన పిల్లల కొరకు 24 గంటలు పనిచేసే ఉచిత అత్యవసర ఫోన్ సేవా సౌకర్యం చైల్డ్ హెల్ప్ లైన్ 1098, పోలీస్ 100 సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కనకతార, అంగన్వాడీ టీచర్లు నజీమా, పద్మ, శ్రీదేవి, చైత్ర, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.