calender_icon.png 20 September, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దసరా ఉత్సవాలకు మంత్రికి ఆహ్వానం

20-09-2025 12:08:58 AM

అలంపూర్, సెప్టెంబర్ 19: రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను అలంపూర్ శ్రీ జోగుళాంబ  బాల బ్రహ్మేశ్వర దేవస్థాన కమిటీ సభ్యులు శుక్రవారం కలిశారు.ఈ మేరకు హైదరాబాద్ లోని సెక్రెటరేట్ లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి దసరాను పురస్కరించుకొని జోగులాంబ క్షేత్రంలో నిర్వహించే శరన్నవ రాత్రి ఉత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రిక దేవస్థాన కమిటీ వారు అందజేశారు.

అనంతరం మంత్రికి అమ్మవారి పట్టుచీర తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్,గద్వాల ఇన్చార్జి సరిత, ఆలయ చైర్మన్ నాగేశ్వరరెడ్డి , ఈవో దీప్తి ,యువజన కాంగ్రెస్  జిల్లా అధ్యక్షులు తిరుమల్, ధర్మకర్తలు జయరాముడు, సరస్వతి, చంద్రశేఖర్ రెడ్డి ,నాగ శిరోమణి ,అడ్డాకుల రాము ,జగన్ గౌడ్ విశ్వనాథరెడ్డి, మోహన్ నాయుడు తదితరులు ఉన్నారు.