20-09-2025 12:09:22 AM
-అడుగడుగున సీసీ కెమెరాలు
-అమ్మవారి మండపాలకు ప్రత్యేక సూచనలు
నిజామాబాద్, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఇటీవల ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించడంతో కేంద్ర దర్యాప్తు బృందాలతో పాటు రాష్ట్ర జిల్లా పోలీసుల అప్రమత్తమయ్యారు. దేవాలయాల్లో భద్రతకు సంబంధించి ఉన్నత అధికారులు జాతీయ నిఘా సంస్థలు దర్యాప్తు సంస్థలు ఘటోరితమైన చర్యలు చేపడుతున్నాయి. సోమవారం నుండి కానున్న దుర్గా శరన్నవరాత్రుల దృష్ట్యా మరింత కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టారు.
మనం వచ్చిన అంగుళాంగుళాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో ఆలయాల్లో నిరంతరం పోలీసు నిఘా కొనసాగించాలని నిర్ణయించారు. వినాయక రాత్రి ఉత్సవాల ముందు నుండే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసాయన ఊపిరి పీల్చుకున్న పోలీసులకు మరో పిడుగు లాంటి వార్త ఎన్‌ఐఏ దాడులు నిర్వహించి ఉగ్ర లింకులు ఐసిస్ తో లింకులు ఉన్నట్టు బోధనలో యువకుడ్ని స్పష్టమైన ఆధారాలతో నిందితుడిని కేంద్ర నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో చాప కింద నీరుల విస్తరిస్తున్న ఉగ్ర లింకులను ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోహింగ్యాల వివరాలను సేకరించే పనిలో జిల్లా పోలీసులు నిమగ్నమయ్యారు. ఆలయాల్లో గట్టిగా కొనసాగించాలని నిర్ణయించిన పోలీస్ శాఖ అందులో భాగంగా దేవాలయాలు ప్రధాన దుర్గా మండపాల కూడళ్లలో మండపాల వద్ద పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దుర్గా నవరాత్రి మండపాల ఆకులను ఆలయ పాలకమండలిలను పోలీస్ శాఖ కోరింది. ఈ సీసీ కెమెరాలు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కొనసంధానం చేయనున్నారు.
తద్వారా ఆలయాల్లో భద్రత అనుమానితుల కదలికలు ప్రత్యేక సందర్భాలలో ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టవచ్చు అన్న ఆలోచనతో పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాలైన నీలకంఠేశ్వర స్వామి ఆలయం బోధన్ చక్రేశ్వరాలయం సారంగాపూర్ హనుమాన్ మందిరం నార్సింగ్ పల్లి వెంకటేశ్వర ఆలయం పెద్దమ్మ తల్లి దేవాలయం ఖివాలయం రామాలయం తోపాటు నగరం జిల్లాలోని ప్రముఖ ఆలయాల వద్ద వ్యాపార కూడళ్ల వద్ద నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.
నిత్యం భక్తుల రద్దీతో ఉండే ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి అంగుళం సీసీ కెమెరా నిహాల్ లో ఉండేలా జాగ్రత్తలnu పోలీస్ శాఖ తీసుకుంటుంది. జిల్లా పోలీసులను అప్రమత్తం చేసి సాయుధ భలాగాలతో నిరంతర బంధవస్తు కొనసాగించనున్నారు. ప్రముఖ ఆలయాల్లో భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు నిఘాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ శాఖ పరిధిలోకి వచ్చే అన్ని ఆలయాల్లోనూ ఇప్పటికే విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు వాటిని ఆలయంలోని ప్రత్యేక మానిటరింగ్ కేంద్రం ఆలయ ఈవోల అధికారిక ఫోన్లకు అనుసంధానం చేయడంతో పాటు ఆలయం వైపునకు వెళ్లే ప్రధాన మార్గం పార్కింగ్ టికెట్ కౌంటర్ దర్శన ప్రదేశం ప్రసాద వితరణ అన్న ప్రసాదం జరిగే కౌంటర్ల తో పాటు భక్తులు సేదతీనే ప్రాంతాలలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు అమర్చారు.
దసరా నవరాత్రుల దృశ్య ఆలయాల్లో భక్తుల రద్దీని తట్టుకోవడంతోపాటు ఆలయాల వద్ద భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఆలయాల్లోని సీసీ కెమెరాలు ఇప్పటికే ఏర్పాటు చేయడంతో పాటు స్థానికంగా మఫ్టీలో కూడా పోలీసులను డ్యూటీలు వేసి మరింత నిఘాను పెంచడంతోపాటు అవసరమైనప్పుడు డ్యూటీలో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఆలయ ఫుటేజిని దుర్గా మండపాల రహదారులు చౌరస్తాలలో పుట్టేజిని పోలీస్ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తూ భద్రత చర్యలను సిపి సాయి చైతన్య పర్యవేక్షించనున్నారు.