26-07-2024 09:41:31 PM
అమరావతి: రాష్ట్రంలోని 8 మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లతో మంత్రి నారాయణ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరినారాయణన్, టిడ్కో ఎండీ పాల్గొన్నారు. కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, టిడ్కో ఇళ్లపై చర్చించారు. పార్కులు, డివైడర్లు, రోడ్లపై గుంతలు, డ్రెయిన్లలో పూడికపై దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. సెంట్రల్ డివైడర్లలో ఎలాంటి ఫ్లెక్సీలున్నా వెంటనే తొలగించాలని ఆదేశించారు.
సెంట్రల్ డివైడర్లలో ఫ్లెక్సీలతో ప్రమాదాలు జరుగుతున్నాయని నారాయణ తెలిపారు. ఈ వర్షకాలంలో వ్యాధులు వ్యాపించకుండా తగ్గిన చర్చలు చేపట్టాలని మంత్రి సూచనలు జారీ చేశారు. అన్న క్యాంటీన్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని, టౌన్ ప్లానింగ్ పై ప్రజల నుచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. టిడ్కో ఇళ్లు వేగంగా పూర్తయ్యేలా చూడాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.