29-10-2025 01:13:54 AM
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
ప్రజా భవన్ లో ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు
మణుగూరు, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేసే నాయకుడు, పేదల కష్టాలను తీర్చే శ్రామికుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 60 వ జన్మది న వేడుకలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో క్యాం కార్యాలయం (ప్రజా భవన్)లో మంగళవారం ఘ నంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకీ నవీన్ అధ్యక్షతన జరిగిన వేడుకలలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి పొంగులేటి కి జన్మదిన శుభాకాంక్షలు తె లిపారు.
అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రో గులకు పాలు, పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. పేద వా రికి కష్టం వచ్చింది అంటే కులం, పార్టీ చూడకుండా సాయం చేసే నాయకుడు పొంగులేటి అని కొనియాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తూ, ప్రజా నేతగా, అభివృద్ధి ప్రధాతగా అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శివ సైదులు, కాటిబోయిన నాగేశ్వరరావు, కూచిపూడి బాబు, బల్లెం సురేష్, గాండ్ల సురేష్, కుర్రం రవి, కూర పాటి సౌజన్య, గంగపురి మురళి పాల్గొన్నారు.