calender_icon.png 29 October, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాజమాన్య హక్కులు లేకుండా రూ.100 కోట్ల ఆస్తి కబ్జా..

29-10-2025 01:10:46 AM

  1. అక్రమ ఆస్తుల స్వాధీనం కోసం ముఖ్యమంత్రి కి లేఖ

మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల అర్బన్, అక్టోబర్ 28 (విజయక్రాంతి):ఎలాంటి యాజమాన్య హక్కులు లే కుండా జగిత్యాల పట్టణం కొత్త బస్టాండ్ స మీపంలో అక్రమంగా వినియోగిస్తున్న రు. 100 కోట్లు విలువ చేసే 20 గుంటల స్థలా న్ని మునిసిపల్ అధికారులు స్వాధీనం చేసుకొని, ప్రజావసరాల కు వినియోగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తున్నట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు.

జగిత్యాల లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీ నియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి మా ట్లాడుతూ న్యూ బస్టాండ్ వద్ద 1952 ప్రాంతంలో పెట్రోల్, డీజిల్, దుకాణం లేకపోవడం తో ప్రజా అవసరాల కోసం దారం వీర మల్లయ్య కు 20 గుంటల భూమిని ము న్సిపల్ కేటాయించిందన్నారు. కేవలం పెట్రో ల్, డీజిల్, కిరోసిన్ ఔట్లెట్ ఏర్పాటు చేయ డం కోసమే ఈ భూమిని కేటాయించగా పెట్రోల్ బంక్ కోసం కేవలం 4 గుంటల భూ మి మాత్రమే ఉపయోగిస్తున్నారన్నారు.

19 52 లో మున్సిపల్ 20 గుంటలు పెట్రోల్, డీసెల్, కిరోసిన్ పంపు ఏర్పాటు కోసం కిబాల రు.2,000 విలువతో కేటాయించింద ని,ఐతేభూమికి సంబంధించిన పత్రాలు స మర్పించాలని మున్సిపల్ కోరినా, దారం వీ రమల్లయ్య తన జీవిత కాలంలో అంటే 19 75 వరకు కూడా  ఎటువంటి ఆధార పత్రా లు సమర్పించలేదన్నారు.దారం వీరమల్లయ్య మరణానంతరం వారి వారసులు కి బాలా ను తెర పైకి తీసుకు వచ్చారని జీవన్ రెడ్డి ఆరోపించారు.

కిబాల 1952 లో కేటాయించినట్లు పేర్కొనగా, 1958 లో ఆ పత్రం తయారీ అయినట్లు తేలిందన్నారు. మున్సిపాలిటీ నోటీసులు జారీ చేయటంతో ఆక్ర మణదారులు కోర్టును ఆశ్రయించడం జరిగిందని,ఆక్రమన దారులు ఇంజెక్షన్ కోసం వెళ్ళారే కానీ ఏనాడు యాజమాన్య హక్కులటైటిల్ కోసం కోర్టులను ఆశ్రయించలేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.దారం వీర మల్ల య్య వారసులకు కోర్టులు  ఎక్కడా కూడా యాజమాన్య హక్కులు నిర్ధారించలేదన్నా రు.

2004 లో మున్సిపల్ ఆస్తులు రక్షించాలని, ఆక్రమణదారులను  తొలగించాలని, జగిత్యాల మున్సిపల్ సబ్ కమిటీ వేయగా, వివిధ అంశాలు పరిశీలించి, కిబాల అనుమాస్పదంగా ఉందని తేల్చారన్నారు. పెట్రో ల్ బంక్ నిర్వాహణ కోసం ఉన్న 4 గుంటల భూమిని మినహాయించి మిగతా 16 గుంట ల భూమిని స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ కౌన్సిల్ నంబర్ 140 ద్వారా తీర్మానం చేసిందన్నారు.

యాజమాన్య హక్కులు లేకుండానే క్రయ, విక్రయాలు చేసినట్లు నిర్ధారిం చారని తెలిపారు. వీరమల్లయ్య సోదరుడు పురుషోత్తం వారసత్వ ఆస్తిగా భాగాలు చేసుకున్నారని,రెవెన్యూ రికార్డులలో 1954- 55 కాశ్ర పహాని లోగానీ, పహానిలో గాని పేరు నమోదు కాలేదని, కేవలం కబ్జా కాలంలో మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణకు పెట్రోల్ బంక్ వద్ద జనరేటర్ గది తొలగించాలని నోటీసు ఇస్తే, మంచాల కృష్ణ  రిట్ పిటిషన్ వేశారని, అదేవిధంగాపెట్రోల్ పంపు కోసం కేటాయించిన భూమి మినహా 16 గుంటల భూమి స్వాధీనం చేసుకోవాలనే మున్సిపల్ తీర్మానం 140 రద్దు చేయాలని మరో రిట్ వేశారన్నారు.

మున్సిపల్ 140 తీర్మానం రద్దు చేయాలనే రిట్ చెల్లదని,  యాజమాన్య హక్కుల కోసం సివిల్ కోర్టు కు వెళ్లాలని కోర్టు ఆదేశించిందన్నారు.