calender_icon.png 29 October, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పేరుతో భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు

29-10-2025 01:14:29 AM

  1. బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

దర్గా కోటిలింగాల అంశంపై స్పష్టత ఇవ్వాలి 

ఆలయంలో ఉన్న దర్గాను అలాగే ఉంచి 

కోటిలింగాలను మాత్రమే తొలగిస్తే మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 28 (విజయక్రాంతి): దక్షిణ కాశీగా పేరుగాంచిన,రాజన్న క్షేత్రం వేములవాడలో అభివృద్ధి పేరుతో జ రుగుతున్న రీనోవేషన్ పనులు భక్తుల్లో ఆం దోళన కలిగిస్తున్నాయని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన పాత్రికేయులతో మా ట్లాడుతూ...గత నాలుగు, ఐదు నెలలుగా దేవాలయం పనులు ఎప్పుడు మొదలవుతా యి, ఎప్పుడు పూర్తవుతాయి అనే అంశంలో స్పష్టత లేకుండా జరుగుతున్నాయి.

దేవాదాయ శాఖ అధికారులు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. అధికార పార్టీ మాత్రం తాము అభివృద్ధికి అడ్డుగా మారుతున్నామనే తప్పుడు ప్రచారం చేస్తోంది. కా నీ మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.గత పది, పదిహేను రోజులుగా పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్న ఆయన, మేము వాటికి వ్యతిరేకం కాదు.

అయితే కనీ సం భక్తులకు రెండు నుంచి మూడు గంటలైనా దర్శనం కల్పించాలని మే 14న బంద్ సమయంలో అఖిలపక్ష కమిటీ తరఫున ఇదే డిమాండ్ చేశామని గుర్తుచేశారు.కోటిలింగాలను తొలగించే ఆలోచన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని అదే సమ యంలో ఆలయంలో ఉన్న దర్గాను అలాగే ఉంచి, కోటిలింగాలను మాత్రమే తొలగిస్తే మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది.

కాబట్టి ప్రభుత్వం రెండు అంశాలపై సమాన నిర్ణయం తీసుకోవాలన్నారు. లేకుం టే కోట్లాది హిందువుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని హెచ్చరించారు.దేవాదాయ శా ఖ సెక్యులర్ శాఖనా? లేక మతపరమైన శా ఖలా? అని ప్రశ్నించిన ప్రతాపరామకృష్ణ, పవర్ ప్రెజెంటేషన్ రోజున కూడా అధికారు లు దర్గా అంశంపై స్పష్టత ఇవ్వలేదన్నారు. ఇది భక్తుల్లో అనుమానాలు కలిగిస్తుందని వి మర్శించారు.

వేములవాడలో హిందూ, ము స్లిం వర్గాలు శతాబ్దాలుగా సామరస్యంగా జీవిస్తున్నప్పటికీ, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉ న్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ అం శంపై స్పందించాలని కోరారు.భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, రెండు వర్గాల మధ్య సమతౌల్యం ఉండేలా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు.

దేవాదాయ శాఖ ఒక వారం రోజుల్లో దర్గా అంశంపై స్పష్టత ఇ వ్వాలి. లేకపోతే బీజేపీ భవిష్యత్ కార్యాచరణలో రాజీ ఉండదన్నారు. ఇది కేవలం బీజే పీ సమస్య కాదు, హిందూ సమాజ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అవసర మైతే మళ్లీ వేములవాడ బంద్ పిలుపునిస్తామని ప్రతాప రామకృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ బిజెపి పట్టణ అధ్యక్షులు. 

రాపెళ్లి శ్రీధర్, రేగుల మల్లికార్జున్ సంటి మహేష్ వివేక్ రెడ్డి సాయి బిల్లాకృష్ణ.మహంకాళి శ్రీనివాస్ రేగుల రాజ్ కుమార్. రేనీకిందిఅశోక్ కటకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.