calender_icon.png 20 December, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

20-12-2025 02:26:09 AM

  1. ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని రాష్ట్రపతితో కల్పించాలి
  2. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కోరండి
  3. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచింది.. బీసీలే, పార్టీలు కాదు 
  4. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్‌కు మూడినట్టే
  5. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల 

ముషీరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లపై అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. అందులో భాగం గా తెలంగాణ పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిల పక్షం తో కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కోరాలని జాజుల డిమాండ్ చేశారు. ఈ మేర కు శుక్రవారం  హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీసీ జేఏసీ సమావేశా నికి జాజుల ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

21 రోజుల పాటు జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బీసీలకు నిరాశ మిగిల్చాయని తెలిపారు. కేవలం 21 నిమిషాలు కూడా బీసీ రిజర్వేషన్లపై చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ విషయంలో పార్లమెంట్‌లో చర్చించాలని పట్టు పట్టాల్సిన రాహుల్ గాంధీ మౌనం వహించారని, బీసీల ఆకాంక్షలను గౌరవించి బీసీ బిల్లును ఆమోదించాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ టూర్‌లతో కాలం వెళ్లదీశారని ఆరోపించారు.

పార్లమెంటు సమావేశా లు జరుగుతున్న సందర్భంలో మూడు రోజు లు ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ బీసీ రిజర్వేషన్ కేంద్రంపైన ఒత్తిడి పెంచడా నికి అఖిలపక్షం తో ప్రధానిని కలిసే ప్రయత్నం చేయలేదని, చివరికి కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలను ఒప్పిం చి పార్లమెం ట్‌లో బీసీ రిజర్వేషన్ల్ల అంశం చర్చ కు వచ్చేలా కనీసం ప్రయత్నం చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ లు తమ రాజకీయ చైతన్యంతో గెలిచారని తెలిపారు.

సర్పంచ్ ఎన్నిక లు పార్టీల గుర్తుల మీద జరిగినవి కావని, బీసీ వాదంతోనే ఈ ఎన్నికలు జరిగాయని, జూబ్లీహిల్స్ ఎన్నికలలో మొదలైన బీసీ వాదం సర్పంచ్ ఎన్నికల వరకు రాజకీయ ప్రభంజనం సృష్టించిందని ఆయన తెలిపారు.  బీసీ వాదం ఎక్కడ బలపడిందని చెపితే రేపటి భవిష్యత్తు లో బీసీలకు రాజకీయ అధికారం లభిస్తుం దని కుట్రతో సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ రామచంద్ర రావు తమ గెలుపంటే తమ గెలుపంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో ముమ్మాటికి బీసీలే గెలుపు అని వ్యాఖ్యానించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలకు వెళతామంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక మూడినట్లేనని హెచ్చరించారు.   

బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా మడత వెంకట్ నియామకం

బీసీ ఉద్యమాల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన మడత వెంకట్ గౌడ్ ను బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీసీ జేఏసీ ఇన్చార్జిగా నియమిస్తున్నట్లు  జాజు ల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని  వెం కట్ గౌడ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మడత వెంకట్ గౌడ్ మా ట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్న ఉద్యమానికి ఖమ్మం జిల్లా ఊతమిచ్చేలా బీసీ జేఏసీ నిర్మాణాన్ని చేపడతానని మడత వెంకట్ గౌడ్ వెల్లడించారు.

సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నిరంజన్, జేఏసీ నేతలు కౌల జగన్నాథం, జాజుల లింగం గౌడ్, తారకేశ్వరీ, ఉదయ్ నేత, గజ్జల సత్యo గౌడ్, శివమ్మ, ఇంద్రం రజక, కృష్ణయ్య పాల్గొన్నారు.