16-01-2026 05:18:53 PM
వాంకిడి,(విజయక్రాంతి): ప్రజలు గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సామెల గ్రామ సర్పంచ్ సంతోష్ అన్నారు. శుక్రవారం పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వార్డుల్లో మురికి కాలువలను శుభ్రం చేయిస్తామని తెలిపారు. గ్రామ పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని ప్రజలను కోరారు.స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడంలో పాలకవర్గానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం చెత్త, మురుగు తొలగింపుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విలాస్ పాల్గొన్నారు.