calender_icon.png 16 January, 2026 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏనుగు రఘుమారెడ్డి ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్

16-01-2026 05:15:26 PM

చిట్యాల,(విజయక్రాంతి): నకిరేకల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏనుగు రఘుమా రెడ్డి ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ కార్యక్రమం శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ కార్యక్రమానికి వెలిమినేడు, పిట్టంపల్లి, బొంగోనిచెర్వు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ప్రజా ప్రతినిధులు,యువజన కాంగ్రెస్ నాయకులు, వేముల అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పతంగులను ఎగరవేసి  కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా ఏనుగు రఘుమా రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాలు రైతుల పండుగలని, ప్రజలంతా ఐక్యంగా ఉండాలని, యువత సామాజిక, క్రీడ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్టంపల్లి,బొంగోనిచెరువు గ్రామాల సర్పంచ్ లు అందె అండాలు-రాములు యాదవ్, కట్ట ఆశయ్య, వెలిమినేడు, బొంగోనిచెరువు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సుర్కంటి సత్తిరెడ్డి, కందాటి మహేందర్ రెడ్డి, పిట్టంపల్లి, బొంగోనిచెరువు గ్రామాల ఉప సర్పంచ్ లు నారగోని నాగరాజు యాదవ్, సామిడి సాయికృష్ణ రెడ్డి, పాల సంఘం చైర్మన్ మారగోని యాదయ్య, వార్డు సభ్యులు వరికుప్పల సంగీత సుధాకర్, చిర్రగోని శ్రీశైలం, దేశబోయిన మంజుల మల్లేష్, మంకాల లింగస్వామి, చింతకింది వెంకటేష్, నాతి స్వామి, బరిశెట్టి గొవర్ధన్, మెడగొని యాదయ్య,మెడగొనిసత్తయ్య, బొంతల నరేందర్ రెడ్డి, కర్దూరి మల్లారెడ్డి, అందే చందు యాదవ్, జక్కలి రాజు అందే శివ, మంకాల నరేందర్, పల్లె మల్లేశ్, చిరగొని శ్రీశైలం, చెరుకు నాగరాజు, పంది భాస్కర్, గాదే ప్రశాంత్, మేడి మహేష్,కట్ట దయానంద్, కొండే మహేష్,వడ్డెపల్లి చింటు, ఏనుగు శ్రీను రెడ్డి, మేడగొని సురేష్, దేవిరెడ్డి అనిల్ రెడ్డి, దేవరపల్లి నవీన్ రెడ్డి కొండా రాజు, చిన్నం వెంకటేష్, వరికుపల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.