16-01-2026 05:13:21 PM
రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మాజీ జెడ్పిటిసికి సన్మానం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాసానిపల్లి గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షులు విట్టల్ రెడ్డి నేతృత్వంలో మాజీ జెడ్పిటిసిల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మండల మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డినీ శాలువతో ఘనంగా సన్మానించారు.రాష్ట్ర మాజీ జెడ్పిటిసిల ఫోరం ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి చేసిన సేవ భావంతో,ఆధ్యాత్మిక అనేక సేవలను గుర్తించి శుక్రవారం మాసానిపల్లి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్లు గ్రామా రెడ్డి సంఘ అధ్యక్షులు విట్టల్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా గ్రామా రెడ్డి సంఘం అధ్యక్షులు విట్టల్ రెడ్డి మాట్లాడుతూ... మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి చేస్తున్న సేవలు వెలకట్టలేనివి అని కొనియాడారు.రాబోయే రోజుల్లో ఇలాగే సేవలు మండల ప్రజలకు మరిన్ని అందించి ముందుకు సాగాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు కిషన్ రెడ్డి,మైపాల్ రెడ్డి,నరసింహారెడ్డి,సంజీవరెడ్డి, జైపాల్ రెడ్డి,భాస్కర్ రెడ్డి, సుభాష్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి,ప్రతాప్ రెడ్డి, రామ్రెడ్డి,కిషన్ రెడ్డి,శశికాంత్ రెడ్డి,మహేందర్ రెడ్డి,నరేందర్ రెడ్డి,అనిల్ రెడ్డి,మాధవరెడ్డి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.