06-01-2026 04:38:54 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly sessions) కొనసాగుతున్నాయి. శాసన సభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ... మన పిల్లల భవిష్యత్ ను నిర్దేశించేదే రైజింగ్ 2047 అని తెలిపారు. మనం కీలమైన మలుపు వద్ద నిలబడి ఉన్నామని, 200 బిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థ వద్ద ఉన్నామన్నారు. 1.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని నిపుణులు చెబుతున్నామని, 3 ట్రిలియన్ డాలర్లకు ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.