calender_icon.png 14 January, 2026 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరాన్నంటిన భోగి పండుగ సంబరాలు

14-01-2026 04:35:37 PM

హరిదాసుల కీర్తనలు,  గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల కోలాటాలు చూపరులను ఆకట్టుకొని అలరించాయి. 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో బుధవారం భోగి, సంక్రాంతి  పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల కోలాటాలు, మహిళల ఆటలు, పాటలు చూపర్ లను ఆకట్టుకొని అలరించాయి. ఈ  కార్యక్రమాన్ని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం చైర్మన్, ప్రముఖ రైస్ మిల్లర్స్ వ్యాపారవేత్త పల్లా మురళీధర్ ప్రారంభించారు.


గత 13 సంవత్సరాలగా భోగి పండగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అనుమాల అరుణ బాపురావు తెలిపారు, కాలనీ వాసులు భోగి మంటలను వెలిగించి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ అంటే సిరులు తెచ్చే పండుగ అని, గాంధీ నగర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో భోగి పండుగ సంబరాలను ఏర్పటుచేసుకొని నిర్వహించుకున్నారు.


ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇంటిల్లిపాదికి ఆనందాన్నిచ్చే పండుగ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల్లో అత్యంత ఆనందంగా జరుకునే పండుగ భోగి పండుగ అని, భోగ బాగ్యాలు తెచ్చే పండుగ భోగి పండుగ అని ప్రజలంతా సుఖసంతోషాలతో భోగి మంటలు వేసుకుంటారని అన్నారు. పాత వస్తువులను అగ్నికి ఆహుతిచేసి జీవితాలలో సుఖసంతోషాలు ఉండాలని భోగి మంటలు వేసుకుంటామని అన్నారు. ఈకార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.