calender_icon.png 7 October, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పొన్నం తక్షణమే క్షమాపణ చెప్పాలి

07-10-2025 06:04:49 PM

కొండగడుపుల నవీన్: యువజన కాంగ్రెస్ మండల కార్యదర్శి

తుంగతుర్తి (విజయక్రాంతి): సహచర మంత్రి అని చూడకుండా మంత్రి లక్ష్మణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని యువజన కాంగ్రెస్ తుంగతుర్తి మండల కార్యదర్శి కొండగడుపుల నవీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ... మంత్రి లక్ష్మణ్ కుమార్ ను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

అట్టి వ్యాఖ్యలు చేసిన సమయంలో పక్కనే ఉన్న మరొక ఎస్సీ మంత్రి వివేక్ స్పందించకపోవడం విచారకరమని అన్నారు. ఎస్సీ మంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సంవత్సర మంత్రి అని కూడా ఇంగిత జ్ఞానం లేకుండా లక్ష్మణ్ కుమారును దూషించడం దళిత సమాజాన్ని కించపరచడమేనని అన్నారు. మాదిగలు అంటే అంత చిన్న చూపా అని మంత్రి పొన్నంను ఆయన ప్రశ్నించారు. ‘‘ఆ మాటను సమర్థించుకొని ఇప్పటివరకు స్పందించకుండా ఉన్నావు అంటే నీ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.