calender_icon.png 7 October, 2025 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీత కార్మికుడికి 2 లక్షల రూపాయల సబ్సిడీ రుణం అందించాలి

07-10-2025 06:14:09 PM

జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు..

నకిరేకల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత వృత్తి చేస్తున్న ప్రతి గీతా కార్మికుడి కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణం అందించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు డిమాండ్ చేశారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని శకుంతల ఫంక్షన్ హాల్ లో ఆ సంఘం నకిరేకల్ మండల నాలుగవ మండల మహాసభ గుడుగుంట్ల బుచ్చిరాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని ఆయన తెలిపారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం 5000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు సబ్సిడీ రుణం అందించాలన్నారు. కల్లుగీత వృత్తి ప్రమాదకరమైనదని తెలిసిన గత్యంతరం లేని పరిస్థితులలో కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. అట్టి వృత్తికి ప్రభుత్వం రక్షణ కల్పించి ఆధునికరించి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చేపట్టాలని కోరారు.

ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో కల్లుగీత తమ ఎన్నికల్లో ఉపయోగించుకొని కార్మికుల సంక్షేమానికి పనిచేస్తలేవని గీతా కార్మికులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారన్నారు. జిల్లాలో వృత్తి  చేస్తున్న  కార్మికులందరికీ కాటమయ్య రక్షణ కవచం అందించాలని జిల్లాలో పెండింగ్లో ఉన్న  ఎక్స్ గ్రేషియా నిధులను వెంటనే విడుదల చేయాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికులకు ఇస్తానన్న 4000 పెన్షన్ ఇవ్వాలని ప్రతి గీతా కార్మికుడికి మోటార్ సైకిలను అందించాలని అదేవిధంగా ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమిని కేటాయించి నీటి సౌకర్యం కల్పించాలని. అన్నారు ఈ మహాసభలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పామునుగుండ్ల అచ్చాలు సంఘం జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల అంజయ్య ఎరుకల అంజయ్యతో పాటు వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు కల్లుగీతా కార్మికులు పాల్గొన్నారు. అనంతరం కల్లుగీతా కార్మిక సంఘం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా కొప్పుల అంజయ్య ప్రధాన కార్యదర్శిగా గుడుగుంట్ల బుచ్చి రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.