calender_icon.png 19 January, 2026 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం మాజీ చైర్మన్ కృష్ణమూర్తి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

09-09-2024 11:23:46 AM

కృష్ణమూర్తి కుటుంబ సభ్యుల పరామర్శలో మంత్రి శ్రీధర్ బాబు

మాదేవపూర్(విజయక్రాంతి):  కాళేశ్వరం మాజీ చైర్మన్ గుడాల కృష్ణమూర్తి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.  భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ గుడాల కృష్ణమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆదివారం కృష్ణమూర్తి చిత్రపటానికి మంత్రి శ్రీధర్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.