calender_icon.png 11 January, 2026 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయ క్రాంతి కథనానికి స్పందించిన అధికారులు

11-01-2026 03:20:31 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఎలుక పల్లి గ్రామంలో ''రోడ్డుపైనే మురికినీరు ఇబ్బందులు పడుతున్న ప్రజలు'' అనే కథనం విజయ క్రాంతి దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామ సర్పంచ్ దుర్గం సరోజ, తిరుపతి స్పందించి ఎలుక పెళ్లి గ్రామానికి వెళ్లి పారిశుద్ధ్య కార్మికులు రోడ్డుపైకి మురికి నీరు రాకుండా చర్యలు చేపట్టారు. వెంటనే స్పందించి గ్రామపంచాయతీ సర్పంచ్ చేసిన పనికి కాలనీ ప్రజలు విజయక్రాంతి దినపత్రిక యాజమాన్యానికి, సర్పంచుకు కృతజ్ఞతలు తెలిపారు.