10-04-2025 03:35:09 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీ-ఫైబర్ నూతన కార్యాలయాన్ని శ్రీధర్ బాబు ప్రారంభించి, టీ-ఫైబర్, టీ-నైక్ట్స్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఆరు నెలల్లో ప్రతి ఇంటికీ స్మార్ట్ టీవీ, ఫైబర్ కనెక్టివిటీ అందిస్తామని, టీ-నైక్ట్స్ ద్వారా టెలివిజన్ పరిచయం చేయబోతున్నామని పేర్కొన్నారు. లోకల్ కేబుల్ ఆపరేటర్లను టీ-నైక్ట్స్ లో భాగస్వామ్యం చేస్తున్నామని, సమస్యల పరిష్కారానికి 'టెరా' అనే చాట్ బాట్ ను ఆవిష్కరించారు. టీ-ఫైబర్, టీ-నైక్ట్స్ సేవలు ప్రజలకు తక్కువ ధరల్లో అందిస్తున్నామని శ్రీధర్ బాబు వెల్లడించారు.