20-05-2025 07:29:27 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ శాసనమండలి సభ్యురాలు విజయశాంతి(MLC Vijayashanti)ని హైదరాబాద్ లోని ఆమె నివాసంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జిల్లాలో పార్టీ బలోపేతానికి పనిచేయాలన్నారు.