calender_icon.png 21 May, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయిని గుర్తిస్తే నిర్భయంగా తెలియజేయండి

20-05-2025 07:45:16 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గంజాయి నియంత్రణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గంజాయి సంబంధించిన ఏ సమాచారం ఉన్న పోలీస్ శాఖకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) తెలిపారు. మంగళవారం దిల్వార్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో గంజాయిని సరఫరా చేస్తున్నట్టు గ్రామస్తుల నుంచి ఫోన్ రావడంతో వెంటనే అక్కడికి చేరుకొని అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని విచారణ చేయడం జరుగుతుందన్నారు. గంజాయిని విక్రయించిన కొనుగోలు చేసిన చట్టరీత్య నేరమని ఆమె తెలిపారు. గంజాయి నేతలకు సమాచార కోసం 87126 59599 ఫోన్ నెంబర్ అందుబాటులో ఉందని అది పనిచేయని పక్షంలో 100 నంబర్ కాల్ చేయాలని సూచించారు.