20-05-2025 07:40:27 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం డబుల్ బెడ్ రూమ్ కాలనీలో మంగళవారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఈ శిబిరం నిర్వహించారు. ఇటీవల స్థానికులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి శిబిరం నిర్వహించాలని కోరిన మేరకు డిఎం అండ్ హెచ్ ఓ ఆదేశాల మేరకు ఈ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ సిబ్బంది వేణుగోపాల్, ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ అఖిల్, అప్సర్ ఖాన్, యంగ్ స్టార్ యూత్ అధ్యక్షులు షేక్ షకీల్, పాల్గొన్నారు.