calender_icon.png 21 May, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 20న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలి

20-05-2025 07:07:10 PM

కార్మిక సంఘాల చేసిన నాయకులు..

మందమర్రి (విజయక్రాంతి): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం(Modi Govt) అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల నిరసిస్తూ ఈ నెల 20న జాతీయ కార్మిక సంఘాల(National Trade Unions) ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను సింగరేణి కార్మికులు(Singareni workers) అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కోరారు. ఏరియాలోని కేకే-5 గనిలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా మార్చడాన్నీ నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 20న చేపట్టనున్న జాతీయ కార్మిక సంఘాల సమ్మెను దేశంలోని యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మిక సంఘాలు వాయిదా వేయడం జరిగిందని వారు స్పష్టం చేశారు.

సమ్మెను వాయిదా వేసిన సంఘాలు అదే రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చిందని దీనిలో భాగంగా ఈనెల 20న నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని అంతేకాకుండా జులై 9న సమ్మెను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సలెంద్ర సత్యనారాయణ, సీఐటీయూ బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి, ఐఎన్టియుసి నాయకులు రాంశెట్టి నరేందర్, ఎఐటియుసి బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్ లు పాల్గొన్నారు.