20-05-2025 07:02:00 PM
ఐపీఎల్-2025 ప్లే ఆఫ్ మ్యాచ్ ల వేదికలను బీసీసీఐ(BCCI) ఖరారు చేసింది. దక్షిణ భారతదేశంలో జరగాల్సిన ఐపీఎల్(IPL) మ్యాచ్ లు తరలింపుపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. బెంగళూరులో వర్షం కారణంగా ఐపీఎల్ వేదికలు మారాయి. మే 23వ తేదీన ఆర్సీబీ-సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగాల్సి ఉంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను బెంగళూరు నుంచి లఖ్ నవూకు తరలించారు. ఆఖరి రెండు లీగ్ మ్యాచ్ లను ఆర్సీబీ లఖ్ నవూలోనే ఆడనుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత ఆర్సీబీ మే 27న లఖ్ నవూ వేదికగా ఎల్ఎస్జీతో తలపడనుంది. ఇదిలా ఉండగా.. ముల్లాన్ పుర్, అహ్మదాబాద్ లో నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లకు మే 29న జరిగే క్వాలిఫయర్-1, మే 30న జరుగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ లకు ముల్లాన్ పుర్ అతిథ్యమివ్వనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వేదికగా జరుగనున్న జూన్ 1న క్యాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్ లకు అహ్మదాబాద్ అతిథ్యమివ్వనుంది.