calender_icon.png 21 May, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రి మూర్ఖత్వంతో 28 రోజుల చంటి పాప ఊపిరాడక మృతి

20-05-2025 07:54:42 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): తండ్రి మూర్ఖత్వం, నిర్లక్ష్యంతో 28 రోజుల వయసుగల చంటి పాప మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో చోటుచేసుకుంది. ఖానాపూర్ సీఐ సిహెచ్ అజయ్ తెలిపిన వివరాల ప్రకారం... ఖానాపూర్ పట్టణానికి చెందిన సుభాష్ నగర్ కాలనీలో అలకుంట శేఖర్ తన భార్య సుజాత మంగళవారం ఉదయం వారి చంటి పాపను పక్కన పడుకోబెట్టుకుని ఉండగా, ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో భర్త శేఖర్ ఆమె పక్కన నిర్లక్ష్యంగా పడుకోవడంతో పసికందు అయిన 28 రోజుల చంటి పాప వారి బరువుకు ఊపిరాడక మృతి చెందిందని ఎస్సై తెలిపారు. ఆలకుంట సుజాత తల్లి అల్లెపు రాజమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు.