20-05-2025 07:01:36 PM
టేకులపల్లి (విజయక్రాంతి): ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యత పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరచారి(District Education Officer M. Venkateswara Chari) అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీఈఆర్టీ వారిచే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టులలో ఐదు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. దానిలో భాగంగా మంగళవారం టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాలో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ ప్రారంభించారు. ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణకు విధిగా ఉపాధ్యాయులు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో కోర్సు ఇంచార్జి మెరుగు శ్రీనివాస్, జిల్లా ఫైనాన్సియల్ ఆఫీసర్ ఎస్. శ్రీనివాసరావు, సాయికృష్ణ, డీఆర్ పీలు నరేశ్ కుమార్, కవిత, రామనాధం, శ్రీనివాస్, మిస్ కో-ఆర్డినేటర్ సంధ్య పాల్గొన్నారు.