20-05-2025 07:26:27 PM
రెండు, మూడు రోజుల్లో కేంద్రాలు మూసివేయాలి..
మండలంలోని ప్రతి బస్తాను వెంకటసాయి మిల్లుకు తరలించాలి..
పెన్ పహాడ్ లోని వెంకట సాయి మిల్లును ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్...
పెన్ పహాడ్ : మండలంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం సేకరణ కేంద్రాలు మరో రెండు, మూడు రోజుల్లో ధాన్యం పూర్తిగా సేకరించి కాంట వేసిన ప్రతి బస్తాను మిల్లులకు తరలించాలని.. మిల్లులలో బస్తాలు లారీలలో నిల్వ ఉండకుండా మిల్లుల యాజమాన్యాన్ని పురామాయించి అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(District Collector Tejas Nandalal Pawar) సూచించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం మాచారంలోని వెంకటసాయి మిల్లును ఆకస్మికంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.
మండలంలో ఉన్న కొనుగోలు కేంద్రాల్లాలో ఉన్న ధన్యాన్ని మొత్తం అందుబాటులో ఉన్న వెంకటసాయి మిల్లుకు టాకింగ్ చేయాలని సివిల్ సప్లై అధికారులకు ఆదేశించారు. ధాన్యం వచ్చిన వెంటనే మిల్లర్లు లారీల నుంచి ధన్యాన్ని దిగుమతి చేయాలని రోజుల తరుబడి దిగుమతి కాకపోయినా, బస్తాల వివరాలు వెంటనే ఆన్లైన్లో పొందపర్చాలని అన్నారు. వీటిల్లో ఏది రోజుల తరుబడి ఆలస్యం మైన రైతులకే కాదు, నిర్వాహకులు, లారీల యజమానులకు ఇబ్బంది కరమన్నారు. ధాన్యం సేకరణపై అధికారులు, మిల్లు యాజమాన్యం కు కలెక్టర్ పలు సూచనలు చేశారు. వారి వెంట సివిల్ సప్లై డిఎం ప్రసాద్, తాసిల్దార్ లాలూ నాయక్, ఏపిఎం అజయ్, తదితరులు ఉన్నారు.